రేపే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కీలక అంశాలు ఇవే
2018 మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతోపాటు.. అందులో లేని చాలా కార్యక్రమాలను ఈ ఐదేళ్లలో చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. విజయవంతంగా వాటిని అమలు చేసి చూపించింది. ఈసారి ప్రభుత్వంపై ప్రజలు మరిన్ని ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో సిద్ధమైంది. తుది మెరుగులు కూడా పూర్తయ్యాయి. రేపు అధికారికంగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటిస్తారు. అభ్యర్థులకు బీ ఫామ్ లు ఇచ్చి ఎన్నికల కదనరంగంలోకి పంపిస్తారు. రేపు సాయంత్రం హుస్నాబాద్ లో బహిరంగ సభ ఉంటుంది. రేపు ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టోపైనే అందరి దృష్టి నెలకొంది.
2018 మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతోపాటు.. అందులో లేని చాలా కార్యక్రమాలను ఈ ఐదేళ్లలో చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. విజయవంతంగా వాటిని అమలు చేసి చూపించింది. ఈ సారి ప్రభుత్వంపై ప్రజలు మరిన్ని ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొడుతోంది. ఈ దశలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే..? అంటూ హరీష్ రావు వంటి నేతలు ఆసక్తిని పెంచారు. మహిళలకు పెద్దపీట వేస్తారని, అన్ని వర్గాలకు మేనిఫెస్టోలో చోటు ఉందన్నారు. ఆ ఆసక్తి ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకుంది. రేపు అధికారికంగా మేనిఫెస్టో విడుదలవుతుంది.
ఆర్థిక సాయం పెంపు..
రైతు బంధు, రైతు బీమా పథకాల కింద ఇస్తున్న నగదు సాయాన్ని మరింత పెంచుతూ మేనిఫెస్టోలో హామీలుంటాయని తెలుస్తోంది. మహిళా సాధికారత కోసం కొత్త పథకాలను ప్రకటిస్తారని అంటున్నారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం, మరింత మందికి ఆర్థిక సాయం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం వంటి హామీలు మేనిఫెస్టోలో ఉండే అవకాశముంది. మధ్య తరగతిని ఆకర్షించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.
♦