గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్

తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Advertisement
Update:2025-02-03 21:07 IST

తెలంగాణ గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్‌లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.

ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ సర్కార్ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్‌-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం. తెలంగాణలో గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకూ జరిగిన సంగతి తెలిసిందే. మెుత్తం 563 పోస్టులకు గానూ 31,403 (క్రీడల కోటా కలిసి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.

Tags:    
Advertisement

Similar News