'పేద, మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ' -కేటీఆర్
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ, ఆయిల్ కంపెనీలకు మాత్రం వేల కోట్ల ప్యాకేజీలు ప్రకటించడం పట్ల మోడీ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. మోడీపై ఆయన వరస ట్వీట్లతో విరుచుకపడ్డారు.
దేశం లో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ధరలు, దిగజారిపోతున్న ప్రజల ఆదాయాలు...కష్టాలతో సతమతమవుతున్న సామాన్యులు...ఈ అంశాలపై తెలంగాణ ఐటీ, పంచాయత్ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. మోడీ పాలనలో సామాన్యుడి పరిస్థితి మరింత దిగజారుతుండగా, ధనికుడు మరింత ధనికుడవుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
ఒకవైపు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేదల నెత్తిపై బండను వేసి ఆయిల్ కంపెనీలకు మాత్రం మోడీ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. దీనిపై ఆయన వరస ట్వీట్లు చేశారు.
ఆయిల్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన వార్తను షేర్ చేసిన కేటీఆర్...
''ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం.!!
ఆడబిడ్డలపై ఆర్థిక భారమా.?
మోడీ పాలనలో
ధరలు ఆకాశంలో..
ఆదాయాలు పాతాళంలో...
ఆయిల్ కంపెనీలకు కాసుల పంట..
కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట
ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప
ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?
గరీబోల్ల గుండెలపై మోయలేని
గుదిబండలు..ఈ గ్యాస్ బండలు'' అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో...
''గ్యాస్ వెయ్యి అయ్యింది, పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది
పేదోడి పొట్టగొట్టడం,
మళ్లీ చేతిలో పొగగొట్టం పెట్టడమే
సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి, ఇప్పుడు 3 సిలిండర్ల జపం చేస్తరా? మూడు సిలిండర్లతో
మూడుపూటలా వంట సాధ్యమా
మహిళా లోకానికి అర్థమైంది,
మోయలేని భారం మోపే వాడే, మోడీ'' అని ట్వీట్ చేశారు కేటీఆర్
మరో ట్వీట్ లో...
'పేద, మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ కేటీఆర్
గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తరు
కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా?
రూ.400 ఉన్న సిలిండర్ ధర
ఇప్పుడు రూ.1100 (NOT-OUT)
ఇంక పెరుగుతూనే ఉంది.
ఆయిల్ కంపెనీలకు కాదు,
ఆర్థికంగా నష్టపోయిన
ఆడబిడ్డలకు ఇయ్యాలే స్పెషల్ ప్యాకేజ్'' అని ట్వీట్ చేశారు కేటీఆర్.
కేటీఆర్ చేసిన ట్వీట్ల పై పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నెటిజనులు బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండి పడుతూ కామెంట్లు పెడుతున్నారు.