ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ - మాట మార్చిన రామచంద్ర పిళ్ళై
పిళ్ళై ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ ధాఖలు చేశాడు. దీనిపై జవాబు ఇవ్వాలంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఊహించని జలక్ తగిలింది. ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై కోర్టును ఆశ్రయించారు.
పిళ్ళై ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ ధాఖలు చేశాడు. దీనిపై జవాబు ఇవ్వాలంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
కాగా పిళ్ళై వాగ్మూలం ఆధారంగానే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు. కవిత ఆదేశాలమేరకే తాను ఇదంతా చేశానని పిళ్ళై చెప్పినట్టు ఈడీ అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు పిళ్ళై తన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ కోర్టులో వేసిన పిటిషన్ ఈడీకి ఆశనిపాతమనే చెప్పాలి. పిళ్ళై వాగ్మూలాన్ని ఆధారం చేసుకొని కవితను అరెస్టు చేయాలని భావిస్తున్న ఈడీ ఇప్పుడేం చేయనున్నదనేది చూడాలి. రేపు కవిత ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. కాగా, పిళ్ళై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో శనివారం కవిత విచారణ ఏ మలుపు తీసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.