తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం చెలరేగింది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ సిబ్బందిని ఏపీ అధికారులు అడ్డుకున్నారు.

Advertisement
Update:2024-11-09 11:42 IST

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం మొదలైంది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా.. అక్కడి ఏపీ సీబ్బంది వారిని అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని?’ అంటూ వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఏపీ మిగులు జలాలను దొంగిలిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించగా.. ప్రభుత్వమే అక్రమంగా జల విద్యుత్ కోసం నీటిని మళ్లిస్తోందని ఏపీ ఆరోపించింది. ఈ ఆరోపణ మధ్య ఇరు రాష్ట్రాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీగా బలగాలను మొహరించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Similar News