మరో నాలుగు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన
తాజాగా మరో నాలుగు బీజేపీ జిల్లాల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది.
Advertisement
తెలంగాణ కమలం పార్టీ 19 ఇటీవలే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించగా.. తాజాగా మరో నాలుగు జిల్లాల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సి.గోదావరి, మహబూబాబాద్‌కు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ-గోషామహాల్‌కు టి. ఉమామహేంద్రను అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర సహా ఎన్నికల అధికారి కే.గీతామూర్తి అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ అధిష్టానం దూకుడు ప్రదర్శిస్తోంది. వీలైనంత మేర క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తోంది.
Advertisement