తొలి గంటలోనే సిరాచుక్క.. తగ్గేదే లేదన్న అల్లు అర్జున్
బన్నీ వచ్చే సమయానికే క్యూలైన్లు ఫుల్ గా ఉన్నాయి. అయినా కూడా ఓపికగా ఆయన క్యూలైన్లో నిలబడి పోలింగ్ బూత్ లోపలికి వెళ్లారు.
హైదరాబాద్ లో ఓటర్లు రికార్డు బ్రేక్ చేసేలా ఉన్నారు. ఉదయం తొలి గంటలోనే సినీ, రాజకీయ ప్రముఖులంతా క్యూ లైన్లలోకి వచ్చేశారు. హీరో అల్లు అర్జున్ కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులెవరూ లేరు, అల్లు అర్జున్ ఒక్కరే పోలింగ్ బూత్ కి వచ్చారు. వైట్ టీ షర్ట్, కళ్లద్దాలతో అర్జున్ సింపుల్ డ్రెస్సింగ్ లో పోలింగ్ బూత్ కి చేరుకున్నారు, క్యూ లైన్లో నిలబడ్డారు.
ఓటర్లతో మాటామంతీ..
క్యూలైన్లో నిలబడ్డ అల్లు అర్జున్ ఓటర్లతో మాట్లాడారు. అల్లు అర్జున్ ని చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపించారు. ఆయనతో మాట కలిపారు. బన్నీ వచ్చే సమయానికే క్యూలైన్లు ఫుల్ గా ఉన్నాయి. అయినా కూడా ఓపికగా ఆయన క్యూలైన్లో నిలబడి పోలింగ్ బూత్ లోపలికి వెళ్లారు.
మీడియా హడావిడి..
సినీ సెలబ్రిటీల పోలింగ్ బూత్ ల గురించి నిన్ననే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏ హీరో ఏ పోలింగ్ బూత్ కి వస్తారనే విషయం ముందుగానే క్లియర్ గా తెలిసిపోయింది. దీంతో మీడియా అంతా అక్కడే కాచుకు కూర్చుంది. అల్లు అర్జున్ వచ్చే సమయానికి మీడియా కెమెరాలన్నీ అక్కడ గుమికూడాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు పోస్ట్ చేసేందుకు చాలామంది ఔత్సాహికులు సెల్ ఫోన్లు బయటకు తీశారు. జూబ్లీ హిల్స్ లోని పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ ఓటు వేశారు. ఆయనతోపాటు అల్లు ఫ్యామిలీ ఓట్లు కూడా అదే బూత్ లో ఉన్నాయి. అయితే బన్నీ మాత్రం సింగిల్ గానే వచ్చారు. తొలిగంటలోనే వేలికి సిరా చుక్క వేయించుకున్నారు.
♦