మూడేళ్లలో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుపై ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో ఈ సమావేశం కొనసాగుతోంది.

Advertisement
Update:2024-11-06 14:27 IST

మూడేళ్లలో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఎయిర్ పోర్ట్ పై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విమానశ్రయ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేండ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవలన్నారు. ప్రతీ పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ పథకంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనుకూలంగా మార్చాలని పేర్కొన్నారు.

యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యి స్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. త్వరలోనే తాను ఎయిర్ పోర్ట్ స్థితిగతులపై పరిశీలిస్తానని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డి, ఆర్ ఆండ్ బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News