ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్..ఆసీస్ చిత్తు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది;
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 45 రన్స్‌తో రాణించాడు ఆఖరిల్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య టీమిండియాను గెలిపించారు. తొలుత ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లకు 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మ్యాచ్‌లో 96 బంతుల్లో అతను 73 రన్స్ చేసి నిష్క్రమించాడు.
ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, వరుణ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, హర్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా, కూపర్, నాథన్, బెన్ తలో వికెట్ తీశారు. రేపు సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య రెండో సైమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది