పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్
పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ను ఆ దేశ పాక్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది.;
Advertisement
పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ను ఆ దేశ పాక్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. అయితే వన్డే సిరీస్‌కు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు వీరిద్దరిని పీసీబీ పక్కనపెట్టింది. 29 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై నిర్వహిస్తోన్న ఐసీసీ టోర్నీలో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక విమర్శలను మూటగట్టుకుంది. అలానే మ్యాచుల నిర్వహణ విషయంలోనూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పీసీబీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement