కూనల చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోతే.. ఇండియాకు కప్పు వస్తుందా?
మనదేశంలోనే జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గాన్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో 2011 సెంటిమెంటే రిపీట్ అయి మనం కప్పు గెలవడం ఖాయమని క్రికెట్ అభిమానులు లెక్కలేస్తున్నారు.
డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన ఆఫ్గనిస్థాన్ వరల్డ్ కప్‌లో పెను సంచలనమే సృష్టించింది. దీంతో పాయింట్ల పట్టిలో ఇంగ్లాండ్ కిందకు దిగింది. రన్‌రేట్ కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇకపై జరగబోయే మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టు భారీ ఆధిక్యాలతో గెలవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ కూనల చేతిలో ఓడిపోవడంతో ఇండియా ఫ్యాన్స్ కూడా సంబరంగా ఉన్నారు. దీనికి ఓ సెంటిమెంట్ కారణంగా చెబుతున్నారు
2011లో ఐర్లాండ్, బంగ్లాదేశ్ చేతిలో ఓడింది
ఇండియాలోనే జరిగిన 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పసికూన ఐర్లాండ్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 327 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ముందు ఉంచింది. అయితే ఐరిష్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒబ్రెయిన్ మెరుపు శతకం చేయడంతో మూడు వికెట్ల తేడాతో ఆ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఇదే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ చేతిలోనూ ఇంగ్లీష్ జట్టు కంగుతింది. ఆ వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది.
ఇప్పుడు అఫ్గాన్ చేతిలో ఓటమితో ఆ సెంటిమెంట్ వర్కవుటవుతుందా?
ఇక మళ్లీ మనదేశంలోనే జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గాన్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో 2011 సెంటిమెంటే రిపీట్ అయి మనం కప్పు గెలవడం ఖాయమని క్రికెట్ అభిమానులు లెక్కలేస్తున్నారు ఈ సెంటిమెంట్ సంగతి ఎలా ఉన్నా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టిలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టుకు సొంత గడ్డమీద ఆడుతున్న అడ్వాంటేజ్ కూడా కలిసొచ్చి విజేత అవుతుందని ఆశిద్దాం.
♦