టీమిండియా టార్గెట్‌ 372

ఆస్ట్రేలియా-భారత్‌ మహిళల జట్ల మధ్య రెండో మ్యాచ్‌. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 97/2

Advertisement
Update:2024-12-08 11:01 IST

మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా-భారత్‌ మహిళల జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతున్నది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధించింది. జార్జియా వోల్స్‌ (101), ఎలీసీ పెర్రీ (105) సెంచరీలు బాదారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 371 రన్స్‌ చేసింది. వీరిద్దరితోపాటు ఫొబే లిచ్‌ఫీల్డ్‌ (60), బెత్‌ మూనీ (56) హాఫ్‌ సంచరీలతో రాణించారు. ఆష్లే గార్డెనర్‌, సోఫీ డకౌట్‌ కాగా.. అన్నాబెల్‌ సదర్లాండ్‌ 6, అలానా కింగ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ (20 నాటౌట్‌ ) రన్స్‌ చేశారు. భారత బౌలర్లలో సైమా ఠాకూర్‌ 3, మిన్ను మణి 2... ప్రియా మిశ్రా, దీప్తి శర్మ, రేణుకా ఠాకూర్‌ సింగ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 371 రన్స్‌ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌ 19 ఓవర్లలో 97/2 చేసింది. విజయానికి ఇంకా 32 ఓవర్లలో 275 రన్స్‌ చేయాలి.రిచా ఘోష్ (48),హర్మన్‌ప్రీత్ కౌర్ (23) క్రీజులో ఉన్నారు.ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిన భారత్‌.. ఈమ్యాచ్‌నూ కోల్పోతే సిరీస్‌ చేజారినట్లే

Tags:    
Advertisement

Similar News