విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ షాక్

టీమిండీయా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.

Advertisement
Update:2024-12-26 16:38 IST

టీమిండీయా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసీస్ ఓపెనర్ కోన్ట్సస్‌ను విరాట్ స్లెడ్జ్ చేసిన ఘటనపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. కోహ్లీ మ్యాచ్‌లో 20 శాతం కోతం పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న 19 ఏళ్ల ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్ ను విరాట్ కోహ్లీ స్లెడ్జ్ చేశారు. నడుచుకుంటూ వస్తుండగా కోహ్లీ భుజం తగిలించారు.

అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు, తోటి ప్లేయర్లు వచ్చి కూల్ చేసారు.ఈ ఘటన తరువాత కోన్ట్సస్ రెచ్చిపోయారు. వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 60 రన్స్ చేసి జడేజా బౌలిగ్ లో ఔట్ అయ్యాడు. ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై అవతలి ఎండ్ వైపు నడిచి వెళుతున్న కాన్‌స్టాస్‌ను విరాట్ కోహ్లి తన భుజంతో బలంగా ఢీకొన్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. అయితే యువ క్రికెటర్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరును చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒక సీనియర​ క్రికెటర్‌ అయివుండి అలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News