సన్ రైజర్స్ ధనాధన్ ..లీగ్ టేబుల్ రెండోస్థానంలో హైదరాబాద్!

ఐపీఎల్ -17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ ను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ చేజంగ్ విజయంతో ముగించింది. లీగ్ టేబుల్ రెండోస్థానంలో చోటు సంపాదించింది.

Advertisement
Update:2024-05-19 20:42 IST

ఐపీఎల్ -17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ ను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ చేజంగ్ విజయంతో ముగించింది. లీగ్ టేబుల్ రెండోస్థానంలో చోటు సంపాదించింది.

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి ( 14వ ) రౌండ్ పోటీని మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ చేజింగ్ విజయంతో ముగించింది. 10 జట్ల లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది.

మొత్తం 14 రౌండ్లలో 8 విజయాలు , 5 పరాజయాలతో 16 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ కోల్ కతా నైట్ రైడర్స్ తరువాతి స్థానంలో నిలిచింది.

అలవోకగా భారీలక్ష్యం సాధించిన రైజర్స్...

హోంగ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా..ఆఖరిరౌండ్ పోరును డే మ్యాచ్ గా నిర్వహించారు. ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగుల భారీస్కోరుతో ప్రత్యర్థి ఎదుట 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

సమాధానంగా మ్యాచ్ నెగ్గాలంటే 215 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన సన్ రైజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికే సాధించడం ద్వారా 4 వికెట్ల విజయం సొంతం చేసుకొంది.

ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవడమే కాదు..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

విరాట్ 8 ఏళ్ల రికార్డు తెరమరుగు...

గత ఎనిమిదేళ్లుగా విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును హైదరాబాద్ సన్ రైజర్స్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తెరమరుగు చేశాడు. ప్రస్తుత సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ 14 రౌండ్లలో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును 23 సంవత్సరాల అభిషేక్ సొంతం చేసుకోగలిగాడు.

ఇన్నింగ్స్ 6వ ఓవర్లో రిషి ధావన్ బౌలింగ్ లో 82 మీటర్ల దూరం సిక్సర్ బాదడం ద్వారా..అభిషేక్ ప్రస్తుత సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 39కి పెంచుకొన్నాడు.

ఈ క్రమంలో 2016 సీజన్ ఐపీఎల్ లో విరాట్ కొహ్లీ సాధించిన 38 సిక్సర్ల రికార్డును అధిగమించాడు.

అభిషేక్ 13 ఇన్నింగ్స్ లో 467 పరుగులు సాధించాడు. 38.91 సగటు, 209.41 స్ట్ర్రయిక్ రేటుతో రికార్డుల మోత మోగించాడు. మొత్తం 35 ఫోర్లు, 39 సిక్సర్లతో సహా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఎలిమినేటర్ రౌండ్ వైపు విరాట్ చూపు..

అభిషేక్ పేరుతో ఉన్న 39 సిక్సర్ల రికార్డును రన్ మెషీన్ విరాట్ కొహ్లీ..ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ లో అధిగమించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుత సీజన్ మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో సహా 708 పరుగులు సాధించాడు. 64.36 సగటు, 155.60 స్ట్ర్రయిక్ రేట్ తో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

సన్ రైజర్స్ అరుదైన రికార్డు...

ప్రస్తుత సీజన్లో ఇప్పటికే రెండు అత్యధిక టీమ్ స్కోర్ల రికార్డు సాధించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆరుమ్యాచ్ ల్లో 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. 2023 సీజన్లో ముంబై, 2024సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సైతం ఈ అరుదైన రికార్డు సాధించగలిగాయి.

ఐపీఎల్ -2024 సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో 41సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం. ప్రస్తుత సీజన్లో అత్యధికంగా అభిషేక్ శర్మ మాత్రమే 41 సిక్సర్లతో టాపర్ గా నిలిచాడు.

అంతేకాదు..అత్యధిక సిక్సర్లు బాదినజట్టు రికార్డును సైతం సన్ రైజర్స్ తన ఖాతాలో వేసుకోగలిగింది. 13 మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ బ్యాటర్లు 160 సిక్సర్లు బాదడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 157 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

Tags:    
Advertisement

Similar News