ఫిఫా ప్రపంచకప్ లో సెనెగల్ సంచలనం!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ రౌండ్ కు చేరిన తొలి ఆఫ్రికాజట్టుగా ఘనా నిలిచింది. రెండుదశాబ్దాల విరామం తర్వాత ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

Advertisement
Update:2022-11-30 08:34 IST

ఫిఫా ప్రపంచకప్ లో సెనెగల్ సంచలనం!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ రౌండ్ కు చేరిన తొలి ఆఫ్రికాజట్టుగా ఘనా నిలిచింది. రెండుదశాబ్దాల విరామం తర్వాత ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ లీగ్ దశ పోటీలు మెరుపువేగంతో సాగిపోతున్నాయి. 32 జట్ల లీగ్ దశ నుంచి 16 జట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరే జట్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

20 సంవత్సరాల విరామం తర్వాత...

ఆఫ్రికన్ థండర్ సెనెగల్ రెండుదశాబ్దాల విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించింది. అంతేకాదు..2022 ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్స్ చేరిన తొలి ఆఫ్రికాజట్టు ఘనతను సొంతం చేసుకొంది.

గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా జరిగిన ఆఖరి రౌండ్ పోరులో సెనెగల్ 2-1 గోల్స్ తో ఈక్వెడార్ ను అధిగమించింది. మరోపోరులో ఆతిథ్య ఖతర్ ను నెదర్లాండ్స్ చిత్తు చేయడంతో సెనెగల్ కు నాకౌట్ రౌండ్ బెర్త్ ఒక్క గెలుపుతో ఖాయమైపోయింది.

నాలుగుజట్ల గ్రూప్- ఏ లీగ్ లో నెదర్లాండ్స్, సెనెగల్ మొదటి రెండుస్థానాలలో నిలవడంతో ఆతిథ్య ఖతర్, ఈక్వెడార్ జట్ల పోరు లీగ్ దశలోనే ముగిసినట్లయ్యింది.

పాపం! ఈక్వెడార్...

సెనెగల్ తో జరిగిన ఆఖరిరౌండ్ మ్యాచ్ ను డ్రాగా ముగించినా..ఈక్వెడార్ కు నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉంది. అయితే..1-2 గోల్స్ ఓటమితో టోర్నీ నుంచి ఇంటిదారి పట్టక తప్పలేదు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ కీలక పోరు తొలి భాగంలో పెనాల్టీ ద్వారా ఇస్మయిలా సెనెగల్ కు తొలిగోలుతో 1-0 ఆధిక్యం అందించాడు. ఆట 67వ నిముషంలో మోజెస్ సియాసెడో సాధించిన గోలుతో స్కోరు 1-1తో సమమయ్యింది. అయితే కౌలీబాలే సాధించిన గోలుతో సెనెగల్ కు నాకౌట్ బెర్త్, ఈక్వెడార్ కు నిష్క్ర్రమణ ఖాయమై పోయాయి.

ఈ కీలక విజయంతో సెనెగల్ 20 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.

క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగే నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ తో సెనెగల్ అమీతుమీ తేల్చుకోనుంది.

వేల్స్ కు ఇంగ్లండ్ షాక్...

గ్రూప్- బీ లీగ్ నుంచి టాపర్ గా ఇంగ్లండ్ ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది. దోహాలోని అహ్మద్ బిన్ అలీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూపు ఆఖరిరౌండ్ పోటీలో ఇంగ్లండ్ 3-0 గోల్స్ తో వేల్స్ ను చిత్తు చేసింది.

ఇంగ్లండ్ ఆటగాళ్లలో రాష్ ఫోర్డ్ ఓ గోలు, ఫోడెన్ రెండుగోల్స్ సాధించారు. 3-0 గోల్స్ తో నెగ్గడం ద్వారా ఇంగ్లండ్ గ్రూపు టాపర్ గా అవతవరించింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో వేల్స్ పోటీ ముగిసినట్లయ్యింది.

1958 తర్వాత తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సంపాదించిన వేల్స్ ఆనందం...లీగ్ దశ ఓటమితో ఆవిరైపోయింది.

1966లో ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్...క్వార్టర్ ఫైనల్ రౌండ్లో చోటు కోసం జరిగే నాకౌట్ పోరులో గ్రూప్- ఏ రన్నరప్ సెనెగల్ తో తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News