ముగిసిన రెండో రోజు ఆట..భారత్‌ 164 /5

ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111 రన్స్‌ చేయాలి.

Advertisement
Update:2024-12-27 14:34 IST

బాక్సింగ్‌ డే టెస్టులోనూ భారత బ్యాటర్లు తడబడ్డారు. దీంతో భారత్‌ కష్టాల్లో పడింది. మరోసారి ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కాలంటే వందకు పైగా రన్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే సగం వికెట్లను కోల్పోయిన భారత్‌కు మూడోరోజో తొలి సెషన్‌ అత్యంత కీలకం కానున్నది. ఆసీస్‌ బ్యాటర్లు విజృంభించిన పిచ్‌పై భారత బ్యాటర్లు తడబాటు కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇన్నింగ్స్‌ కుదుటపడింది అనుకునేలోపే వరుసగా వికెట్లను సమర్పించి ఇబ్బందులను కొనితెచ్చుకున్నది.

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 రన్స్‌ చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌ (6*), రవీంద్ర జడేజా (4*) ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ , బోలాండ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 రన్స్‌ చేసిన విషయం విదితమే. టీమిండియా ఇంకా 310 రన్స్‌ వెనుకంజలో ఉన్నది. ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111 రన్స్‌ చేయాలి.

భారత ఇన్నింగ్స్‌లో రనౌట్‌ కీలక మలుపుగా మారింది. ఓపెనర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (3) విఫలమైనప్పటికీ కేఎల్‌ రాహుల్‌( 24) కొద్దిసేపు క్రీజులో పాతుకుపోయాడు. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (82) ఆరంభంలో ఆచితూచి ఆడారు. కొద్దిగా కుదురుకున్నాక బ్యాట్‌ను ఝళిపించాడు. కేఎల్‌తో కలిసి రెండో వికెట్‌కు 43 రన్స్‌ జోడించాడు. ఇలాంటి సమయంలో కేఎల్‌ను కమిన్స్‌ అద్భతమైన బాల్‌కు క్లీన్‌బోల్డ్‌ చేశాడు. ఆ తర్వాత యశస్వితో విరాట్‌ కోహ్లీ (36) కలిశాడు. వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లను చిత్తు చేసి రన్స్‌ రాబట్టారు. సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్‌ కెరీర్‌లో 9వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే బోలాండ్‌ బౌలింగ్‌ మిడాన్‌ వైపుగా బాల్‌ను కొట్టి యశస్వి రన్‌ కోసం నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌కు పరుగెత్తాడు. కోహీ మాత్రం వద్దని వారించి వెనక్కి మళ్లాడు. అప్పటికే యశస్వి ఇటువైపు వచ్చేశాడు. మిడాన్‌ ఫీల్డర్‌ కమిన్స్‌ నేరుగా స్ట్రైకింగ్‌వైపు బాల్‌ విసిరాడు. వికెట్‌ కీపర్‌ బాల్‌ను తీసుకుని స్టంప్స్‌ను పడేశాడు. సెంచరీ చేసే అవకాశం కోల్పోవడంతో యశస్వి నిరాశగా పెవిలియన్‌కు చేరాడు

ఈ సిరీస్‌లో ఆఫ్‌సైడ్‌ బాల్‌ను ఆడి ఇప్పటివరకు ఔటైన కోహ్లీ మరోసారి తన బలహీనతకే పెవిలియన్‌ బాట పట్టాడు. ఆరంభంలో ఆఫ్‌సైడ్‌ బాల్స్‌ను వదిలేసి క్రమశిక్షణ పాటించాడని అనుకున్న సమయంలో బోలాండ్‌ వేసిన ఆఫ్‌ సైడ్‌ బాల్‌ను కదిలించి వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కాడు. యశస్వి రనౌట్‌తో పాటు విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సేపూ మెల్‌బోర్న్‌ మైదానం తన నామస్మరణతో హోరెత్తిపోవడంతో ఏకాగ్రతను కోల్పోయినట్లు ఉన్నాడని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. నైట్‌ వాచ్‌మనగ్‌గా వచ్చిన ఆకాశ్‌ దిప్‌ (0) రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాఒక్క రన్‌ కూడా చేయలేదు. బోలాండ్‌ బౌలింగ్‌లో నాథన్‌ లైయన్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో ఆకాశ్‌ ఔటయ్యాడు. 

Tags:    
Advertisement

Similar News