రోహిత్‌శర్మ మరో అరుదైన ఘనత

అత్యధిక వయసు కెప్టెన్‌గా ఉంటూ క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచిన రోహిత్‌

Advertisement
Update:2024-09-21 10:35 IST

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్‌ రెండు ఇన్సింగ్స్‌లో కలిపి మొత్తం 11 రన్స్‌ చేశాడు. అయినప్పటికీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ ఏడాది రోహిత్‌ 1000 రన్స్‌ సాధించాడు. 2024 క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌ 27 మ్యాచ్‌ల్లో 1,001 పరుగులు చేశాడు. వీటిలో మూడు వన్డేల్లో 157 పరుగులు కాగా, 11 టీ20ల్లో 378 పరుగులు, ఏడు టెస్టుల్లో 466 పరుగులున్నాయి. ఈ క్రమంలో అత్యధిక వయసు కెప్టెన్‌గా ఉంటూ క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ వయసు ప్రస్తుతం 38 ఏళ్ల 144 రోజులు

ఓవరాల్‌గా ఒకే ఏడాదిలో 1000 పరుగులు చేసిన జాబితాలో రోహిత్‌ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలకం బ్యాటర్‌ పాథున్‌ నిస్సాంక (24 మ్యాచ్‌ల్లో 1,164) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కుశా మెండిస్‌ (33 మ్యాచ్‌ల్లో 1, 161), యశస్వి జైస్వాల్‌ (1,099) కమిందు మెండిస్‌ (1,028) తర్వాత స్థానాల్లో నిలిచారు. భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ కూడా మరో అరుదైన ఘనత సాధించాడు. పది టెస్టుల్లోనే 1000కి పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడు 10 టెస్టుల్లో 1,094 రన్స్‌ చేశాడు. 

Tags:    
Advertisement

Similar News