టీ20 క్రికెట్‌లో అత్యధిన సిక్సర్లు కొట్టిన పూరన్..వరల్డ్ రికార్డు
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ సంచలన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 150కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్, హిట్టర్ నికోలస్ పూరన్ సంచలన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే సంవత్సరంలో 150కి పైగా సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 63 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమ చేతి బ్యాటర్ ఏకంగా 151 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మంచి ఫామ్‌లో ఉండడంతో అతడు మరిన్ని సిక్సర్లు బాదే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన రికార్డును పూరన్ బద్దలు కొట్టాడు. సుమారు 10 ఏళ్లుగా పదిలంగా క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్.. సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. 43 బంతుల్లోనే ఏకంగా 7 ఫోర్లు, 9 సిక్స్‌లు కొట్టి 97 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్ల ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.