నేటి నుంచే లెజెండ్స్ లీగ్ క్రికెట్!

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతజీవితం గడుపుతున్నదిగ్గజ క్రికెటర్ల క్రికెట్ లీగ్ కు ఈరోజు కోల్ కతా లో తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7-30గంటలకు ప్రారంభమయ్యే తొలిసమరంలో ఇండియా క్యాపిటల్స్ తో గుజరాత్ జెయింట్స్ ఢీ కోనుంది.

Advertisement
Update:2022-09-17 14:41 IST

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతజీవితం గడుపుతున్నదిగ్గజ క్రికెటర్ల క్రికెట్ లీగ్ కు ఈరోజు కోల్ కతా లో తెరలేవనుంది.ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7-30గంటలకు ప్రారంభమయ్యే తొలిసమరంలో ఇండియా క్యాపిటల్స్ తో గుజరాత్ జెయింట్స్ ఢీ కోనుంది.....

క్రికెట్ లీగ్ లకు ఓ సీజన్, ఓ రీజన్ అంటూ లేకుండా పోయింది. వివిధ దేశాలలో జరుగుతున్న దేశవాళీ టీ-20 క్రికట్ లీగ్ లకు తోడు ఐసీసీ, ఏసీసీ నిర్వహించే అంతర్జాతీయ

టోర్నీలతో ఇటు ఆటగాళ్లు, అటు అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏ లీగ్ చూడాలో, ఏమ్యాచ్ లు చూడాలో తెలియక తికమకపడిపోతున్నారు.

ప్రస్తుతం ఉన్న క్రికెట్ లీగ్ లు చాలవన్నట్లుగా...వెటరన్ క్రికెటర్ల లీగ్ కు సైతం రంగం సిద్ధమయ్యింది.

దిగ్గజ క్రికెటర్ల కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్...

అంతర్జాతీయ క్ర్రికెట్ అన్నిరకాల ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి...హాయిగా రిటైర్మెంట్ జీవితం గడుపుతున్న వివిధ దేశాల క్రికెటర్ల కోసం లెజెండ్స్ లీగ్ పేరుతో ఓ టోర్నీకి రంగం సిద్ధమయ్యింది.

భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, గౌతం గంభీర్, కరీబియన్ థండర్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా గ్రేట్ ఆల్ రౌండర్ జాక్ కలిస్, కంగారూ స్టార్ షేన్ వాట్సన్, కివీ మాజీ కెప్టెన్ రోస్ టేలర్, ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రీమ్ స్వాన్, ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ లాంటి

దిగ్గజ క్రికెటర్లు వివిధ జట్లలో సభ్యులుగా బరిలోకి దిగుతున్నారు.

లీగ్ లో తలపడుతున్న జట్లలో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ ఉన్నాయి. ఈ నాలుగుజట్లలో మూడుజట్లకు అబానీ, అదానీ , జీఎమ్మార్ యజమానులుగా ఉన్నారు.

కోల్ కతా లో రాత్రి 7-30కి జరిగే తొలిపోరులో ఇండియా క్యాపిటల్స్,గుజరాత్ జెయింట్స్ ఢీకొంటాయి.

ఆదివారం లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా జరిగే రెండోపోరులో మణిపాల్ టైగర్స్ తో భిల్వారా కింగ్స్ జట్లు తలపడతాయి.

సెప్టెంబర్ 19న మణిపాల్ టైగర్స్ తో గుజరాత్ జెయింట్స్, 21న జరిగే పోరులో ఇండియా క్యాపిటల్స్ తో భిల్వారా కింగ్స్ పోటీపడతాయి. ఈ మూడుమ్యాచ్ లూ లక్నో వేదికగానే నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 22 నుంచి 25 వరకూ జరిగే మూడుమ్యాచ్ లకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికకానుంది. 22న మణిపాల్ టైగర్స్ తో గుజరాచ్ జెయింట్స్, 24న ఇండియా క్యాపిటల్స్ తో భిల్వారా కింగ్స్, 25న జరిగే పోటీలో ఇండియా క్యాపిటల్స్ తో గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడతాయి.

26 నుంచి జరిగే మూడురౌండ్ల మ్యాచ్ లకు కటక్ లోని బారాబతీ స్ట్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

సెప్టెంబర్ 30నుంచి అక్టోబర్ 4 వరకూ జరిగే మరో మూడురౌండ్ల పోటీలను జోధ్ పూర్ లోని బర్కతుల్లాఖాన్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.

అక్టోబర్ 2న జోధ్ పూర్ వేదికగానే జరిగే తొలి క్వాలిఫైయర్ సమరం సాయంత్రం 4 గంటలకే ప్రారంభంకానుంది.

అక్టోబర్ 3న జరిగే ఎలిమినేటర్, 5న జరిగే ఫైనల్స్ వేదికలను ఖరారు చేయాల్సి ఉంది.

గుజరాత్ జెయింట్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో క్రిస్ గేల్, పార్థివ్ పటేల్, అజంతా మెండిస్, మాన్విందర్ బిస్లా, లెండిల్ సిమ్మన్స్, రిచర్డ్ లెవీ, మిషెల్ మెక్ లెంగాన్, స్టువర్ట్ బిన్నీ, కెవిన్ ఓ బ్రియన్, అశోక్ థిండా, జోగందర్ శర్మ, గ్రీమ్ స్వాన్, క్రిస్ ట్రెమ్లెట్, ఎల్టన్ చిగుంబరా ఉన్నారు,

మణిపాల్ టైగర్స్ జట్టుకు హర్భజన్ సింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. జట్టులోని ఇతర సభ్యులలో పర్విందర్ అవానా, వీఆర్వీసింగ్, ఇమ్రాన్ తాహీర్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్, ఫిల్ ముస్టార్డ్, మహ్మద్ కైఫ్, రెయిన్ సైడ్ బాటమ్, లాన్స్ క్లూజ్నర్, డిమిట్రీ మెస్కరెనాస్, రమేశ్ కలువితరణే, రితిందర్ సింగ్ సోధీ, కోరీ యాండర్సన్, డారెన్ సామీ ఉన్నారు.

ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్ గంభీర్...

లీగ్ లో తలపడుతున్న ఇండియా క్యాపిటల్స్ జట్టుకు గౌతం గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో లైమ్ ప్లంకెట్, రజత్ భాటియా, హామిల్టన్ మసకట్జా, ముషరఫే ముర్తాజా, జాన్ మూనీ, రవి బొపారా, ప్రవీణ్ తంబే, దినేశ్ రాందిన్, అస్గర్ అఫ్ఘాన్, మిషెల్ జాన్సన్, ప్రాస్పర్ ఉత్సేయా, రోజ్ టేలర్, జాక్ కలిస్, అజంతా మెండిస్, పంకజ్ సింగ్ ఉన్నారు.

ఇర్ఫాన్ పఠాన్ నాయకత్వంలోని భిల్వారా కింగ్స్ జట్టు ఆటగాళ్లలో యూసుఫ్ పఠాన్, నిక్ కాంప్టన్, శ్రీశాంత్, షేన్ వాట్సన్, టిమ్ బ్రెస్నన్, ఓవైసీ షా, మోంటీ పనేసర్, నమన్ ఓజా, విలియమ్ పోర్టర్ ఫీల్డ్, ఫీడెల్ ఎడ్వర్డ్స్, సమిత్ పటేల్, మాట్ ప్రయర్, టినో బెస్ట్, సుదీప్ త్యాగీ ఉన్నారు.

లీగ్ లో రెండుమ్యాచ్ లు మినహా మిగిలిన పోటీలన్నీ రాత్రి 7-30 గంటలకే ప్రారంభంకానున్నాయి.

మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి మాజీ దిగ్గజాలు ఈ లీగ్ కు మెంటార్లుగా మాత్రమే సేవలు అందించాలని నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News