రేపటి నుంచి టీ 20లో సౌత్‌ ఆఫ్రికాతో టీమిండియా ఢీ

ముమ్మర సాధన చేస్తున్న సూర్యకుమార్‌ సేన

Advertisement
Update:2024-11-07 14:48 IST

పొట్టి క్రికెట్‌ ఫార్మాట్‌ లో తలపడేందుకు టీమిండియా సౌత్‌ ఆఫ్రికా పర్యటనకు వెళ్లింది. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని యంగ్‌ ఇండియా ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచ్‌ ల సరీస్‌ లో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మూడు మ్యాచ్‌ లు సాయంత్రం 5 గంటలకు, రెండో మ్యాచ్‌ నాలుగు గంటలకు ప్రారంభవుతాయి. శుక్రవారం మొదటి టీ 20, ఈనెల 10, 13, 15 తేదీల్లో మిగతా మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఇండియా టీమ్‌ లో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, రింకూసింగ్‌, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్థిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అవేశ్‌ ఖాన్‌, యష్‌ దయాల్‌ సభ్యులుగా ఉన్నారు. మార్కమ్‌ కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా టీమ్‌ లో బార్ట్‌మాన్, కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రుగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సిమెలన్ తో పాటు మూడు, నాలుగో టీ 20లకు ట్రిస్టన్‌ స్టబ్స్‌ కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో టీ 20 ఫార్మాట్‌ లో ఇండియాదే పైచేయిగా ఉంది. సౌత్‌ ఆఫ్రికా గడ్డపై సిరీస్‌ గెలిచి తీరాలని సూర్యకుమార్‌ సేన కఠోర సాధన చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News