వచ్చే నాలుగేండ్లకు FTP ప్రకటించిన ఐసీసీ.. భారీగా పెరిగిన మ్యాచ్‌ల సంఖ్య
ఇక వద్దంటే క్రికెట్..నాలుగేళ్లలో 777 మ్యాచ్ లు
ప్రపంచీకరణ పుణమ్యా అంటూ క్రికెట్ వెలిగిపోతోంది. టీవీ ప్రత్యక్ష ప్రసారాలలో వ్యాపార ప్రచార క్రీడగా క్రికెట్ కు ఉన్న ఆదరణను మరింతగా సొమ్ము చేసుకోడానికి ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) ప్రణాళికలు అమలు చేస్తోంది.
2023-2027 మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో వివిధ జట్ల మధ్య 777 అంతర్జాతీయ ( టెస్టులు, వన్డేలు, టీ-20 ) మ్యాచ్ లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.
పురుషుల విభాగంలో ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ను ఖరారు చేసింది. 2019-2023 ఎఫ్టీపీతో పోల్చితే మ్యాచ్ ల సంఖ్యను గణనీయంగా పెంచింది.
భారత్ లో భారీగా మ్యాచ్ లు...
2019-23 ఎఫ్టీపీలో అన్ని జట్లు కలసి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ-20లు ఆడాల్సి ఉండగా.. 2023-27లో వీటి సంఖ్యను మరింతగా పెంచింది ఐసీసీ. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే నాలుగేళ్ళ కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ-20లు ఆడాల్సి ఉంది. రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మ్యాచ్ ల సంఖ్య 777 కు పెరిగింది
గత నాలుగుసంవత్సరాల ఎఫ్టీపీతో పోల్చితే వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో పురుషుల క్రికెట్ జట్లు.. 87 మ్యాచ్‌లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేళ్ల కాలంలోనే ఒక్కో వన్డే ప్రపంచకప్, మనీ ప్రపంచకప్ ( చాంపియన్స్ ట్రోఫీ ), రెండు టీ-20 ప్రపంచకప్‌లు, రెండు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ కూడా జరుగనున్నాయి.
ఇక ప్రపంచ క్రికెట్ కు ప్రధానకేంద్రంగా ఉన్న భారత్ ఆడాల్సిన సిరీస్ లు, మ్యాచ్ ల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది.
2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో టెస్టు సిరీస్ లు ఆడనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్‌లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికా జట్లు మాత్రం భారత పర్యటనకు రానున్నాయి.
భారతజట్టు.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిఫ్రికా పర్యటనలకు సైతం వెళ్లనుంది.
2023-2027 ఎఫ్టీపీలో భాగంగా మొత్తం ఆరు ఐసీసీ ప్రపంచ టోర్నీలు జరుగనుండడంతో..ప్రసారహక్కుల విక్రయం ద్వారా వేలకోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలన్న పట్టుదలతో ఉంది.