చేతులెత్తేసిన టీమిండియా టాప్‌ఆర్డర్‌

లక్ష్య చేధనలో తడబడుతున్న భారత బ్యాటర్లు

Advertisement
Update:2024-11-03 10:40 IST

కివీస్‌ జరుగుతున్న మూడో టెస్ట్‌ లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్‌ను సాధించడంలో విఫలమౌతున్నారు. 8 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 41 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయింది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా సిరీస్‌ వైట్‌ వాష్‌ కాకుండా ఉండాలంటే ఆచితూచి ఆడాల్సిన సమయంలో అప్పనంగా వికెట్లు అప్పగిస్తున్నది. ప్రస్తుతం రిషబ్‌ పంత్‌ (16), రవీంద్ర జడేజా (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంకా 106 రన్స్‌ కావాలి. ఇప్పటికే కీలకమైన యశస్వీ జైస్వాల్‌ (5), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (11) శుభ్‌మన్‌ గిల్‌ (1), విరాట్‌ కోహ్లీ (1) సర్ఫరాజ్‌ ఖాన్‌ (1) వికెట్లు కోల్పోయింది. 13 రన్స్‌ వద్ద రోహిత్‌: 16 పరుగుల వద్ద గిల్‌, 18 రన్స్‌ వద్ద కోహ్లీ, 28 రన్స్‌ వద్ద జైస్వాల్‌, 29 పరుగుల వద్ద సర్ఫరాజ్‌ ఔటయ్యారంటే భారత బ్యాటర్లు ఎంత పేలవ ప్రదర్శన చేస్తున్నారో తెలుస్తోంది. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 3, హన్రీ, గ్లేన్‌ ఫిలిప్స్‌ తలో వికెట్‌ తీసి భారత టాప్‌ ఆర్డన్‌ను కుప్పకూల్చారు.

Tags:    
Advertisement

Similar News