ప్రపంచకప్ లో ఫ్రాన్స్ రికార్డుల మోత!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఫ్రాన్స్ రికార్డుల మోత మోగించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరడం ద్వారా మరో అరుదైన రికార్డుకు చేరువయ్యింది.

Advertisement
Update:2022-12-15 12:02 IST

ప్రపంచకప్ లో ఫ్రాన్స్ రికార్డుల మోత!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఫ్రాన్స్ రికార్డుల మోత మోగించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరడం ద్వారా మరో అరుదైన రికార్డుకు చేరువయ్యింది...

ప్రపంచ సాకర్ అభిమానులను గత మూడువారాలుగా అలరిస్తున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ ముగియటానికి ఇంకా రెండుమ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి.

32 జట్లతో కూడిన తొలిదశ గ్రూప్ లీగ్‌, 16 జట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్స్, 8 జట్ల క్వార్టర్ ఫైనల్స్, 4జట్ల సెమీఫైనల్స్ విజయవంతంగా ముగియటంతో..ఇక టైటిల్ సమరంతో పాటు..మూడోస్థానం కోసం పోటీ మాత్రమే మిగిలాయి.

తొలిసెమీపైనల్లో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేస్తే...రెండో సెమీఫైనల్లో ఆఫ్రికా సంచలనం మొరాకో ను ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ 2-0 గోల్స్ తో కంగు తినిపించింది.

అప్పుడు బ్రెజిల్..ఇప్పుడు ఫ్రాన్స్...

ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ చరిత్రలో వరుసగా రెండు టోర్నీలలో ఫైనల్స్ చేరిన మూడోజట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. 1998 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్..ప్రస్తుత 2022 ప్రపంచకప్ ఫైనల్స్ కు సైతం చేరడం ద్వారా..గతంలో ఇదే ఘనత సాధించిన బ్రెజిల్, ఇటలీ జట్ల సరసన నిలిచింది.

అంతేకాదు..1938లో ఇటలీ, 1962లో బ్రెజిల్ సాధించిన బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ రికార్డును సైతం అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఆదివారం ఖతర్ రాజధాని దోహా వేదికగా జరిగే టైటిల్ సమరంలో అర్జెంటీనాను ఓడించగలిగితే ఫ్రాన్స్ వరుసగా రెండు ప్రపంచ టైటిల్స్ సాధించిన మూడోజట్టుగా చరిత్రలో నిలిచిపోగలుగుతుంది.

క్రొయేషియాకు మొరాకో సవాల్..

ప్రపంచకప్ ఫైనల్స్ చేరకుండానే సెమీస్ పరాజయాలతో కంగు తిన్న క్రొయేషియా, మొరాకోజట్లు...మూడోస్థానం కోసం శనివారం జరిగే పోరులో తలపడబోతున్నాయి. పలువురు కీలక ఆటగాళ్ల గాయాలతో బలహీన పడిన మొరాకో..ఇప్పటికే సెమీఫైనల్స్ చేరిన ఆఫ్రికా ఖండ తొలిజట్టుగా చరిత్ర సృష్టించింది. మూడోస్థానం పోరులో క్రొయేషియాను మొరాకో అధిగమించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది.

Tags:    
Advertisement

Similar News