ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్-10లో సింధు, ప్రణయ్!

ప్రపంచ బ్యాడ్మింటన్ అత్యుత్తమ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు భారత ప్లేయర్లు చోటు సంపాదించారు. పురుషుల, మహిళల విభాగాలలో ప్రణయ్, సింధు భారత టాప్ ర్యాంకర్లుగా నిలిచారు

Advertisement
Update:2023-01-04 13:39 IST

ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్-10లో సింధు, ప్రణయ్!

ప్రపంచ బ్యాడ్మింటన్ అత్యుత్తమ ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు భారత ప్లేయర్లు చోటు సంపాదించారు. పురుషుల, మహిళల విభాగాలలో ప్రణయ్, సింధు భారత టాప్ ర్యాంకర్లుగా నిలిచారు..

2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభానికి ముందే...అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల, మహిళల విభాగాలలో అత్యుత్తమ క్రీడాకారుల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.

భారత్ కు చెందిన ముగ్గురు బ్యాడ్మింటన్ స్టార్లు..మొదటి 10 అత్యుత్తమ ర్యాంకర్లలో చోటు సంపాదించారు.

పురుషుల సింగిల్స్ లో భారత అత్యుత్తమ ఆటగాడిగా హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమంగా ప్రణయ్ ప్రపంచ ర్యాంకింగ్స్ 8వ స్థానంలో నిలిచాడు.

2022 సీజన్ ప్రారంభంలో 26వ ర్యాంకర్ గా ఉన్న ప్రణయ్ గత ఏడాదికాలంలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా తన ర్యాంక్ ను 8వ ర్యాంక్ కు మెరుగుపరచుకోగలిగాడు.

30 ఏళ్ల ప్రణయ్ కనీసం ఒక్క టైటిల్ నెగ్గక పోయినా స్విస్ ఓపెన్లో రన్నర్ స్థానం సాధించాడు. మలేసియా మాస్టర్స్, ఇండోనీషియా ఓపెన్ సెమీఫైనల్స్ చేరడం ద్వారా సత్తా చాటుకొన్నాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య టూర్ ఫైనల్స్ కు అర్హత సాధించిన భారత ఏకైక ఆటగాడు ప్రణయ్ మాత్రమే కావడం విశేషం. భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు.

13వ స్థానానికి పడిపోయిన కిడాంబీ శ్రీకాంత్...

పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ 13వ ర్యాంక్ కు పడిపోయాడు. యువఆటగాడు లక్ష్యసేన్ మూడుస్థానాలు పడిపోయి 10వ ర్యాంకులో నిలిచాడు.

మహిళల సింగిల్స్ లో పీవీ సింధు 7వ ర్యాంక్ ను నిలబెట్టుకొంది. గత ఏడాదికాలంగా సింధు 7వ ర్యాంకులోనే కొనసాగుతూ వస్తోంది.

పురుషుల డబుల్స్ లో భారత యువజోడీ చిరాగ్ షెట్టీ- సాత్విక్ సాయిరాజ్ తమ కెరియర్ లోనే అత్యుత్తమంగా 5వ ర్యాంక్ సాధించగలిగారు. గతేడాదికాలంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అసాధారణ విజయాలు సాధించగలిగారు.

పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే థామస్ కప్ ను తొలిసారిగా భారతజట్టు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల, మహిళల సింగిల్స్ తో పాటు..పురుషుల డబుల్స్, టీమ్ విభాగాలలో సైతం భారత్ బంగారు పంట పండించుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News