బ్లూ ఆధార్ కార్డ్ గురించి తెలుసా?

నెలల వయసున్న పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం కోసం తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.

Advertisement
Update:2024-02-15 15:02 IST

ఆధార్ కార్డు గురించి మనకు తెలుసు. కానీ బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా? ఇది ప్రత్యేకంగా ఐదేళ్ల లోపు పిల్లల కోసం రూపొందించిన కార్డు. దీంతో ఉపయోగాలేంటి? దీన్నెలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశ పౌరులకు ఉండాల్సిన గుర్తింపు కార్డుల్లో ఆధార్‌ కార్డు ముఖ్యమైంది. 12 అంకెల యునిక్ ఐడెంటిటీ కోడ్ రూపంలో పౌరుల వివరాలన్నీ ఆధార్ పోర్టల్‌లో సంక్షిప్తమై ఉంటాయి. అయితే ఇందులో పిల్లల వివరాలను ప్రత్యేకంగా జత చేయడం కోసం ‘యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ బ్లూ ఆధార్ కార్డులను తీసుకొచ్చింది.

బ్లూ ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది. ఇది ఐదేళ్ల లోపు పిల్లలకు జారీ చేస్తారు. ఇందులో పిల్లల ఫొటోతో పాటు పూర్తి పేరు, చిరునామా, తల్లిదండ్రుల వివరాల వంటి బేసిక్ డీటెయిల్స్ పొందుపరుస్తారు. దీన్ని తల్లిదండ్రుల ఆధార్ కార్డు నెంబర్‌‌తో లింక్ చేస్తారు. అయితే పిల్లల వయసు ఐదేళ్లు వచ్చేవరకే ఈ బ్లూ ఆధార్‌ కార్డు వర్తిస్తుంది. ఆ తర్వాత బయోమెట్రిక్, ఐరిస్ వంటి వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డుని అప్‌డేట్ చేసుకోవాలి.

నెలల వయసున్న పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం కోసం తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ ఐడెంటిటీ కార్డుతో కూడా బ్లూ ఆధార్ కార్డు పొందొచ్చు.

బ్లూ ఆధార్ కార్డ్ ఉండడం ద్వారా పిల్లలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను పొందే వీలుంటుంది. పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందే వీలుంటుంది. స్కూల్స్‌లో అడ్మిషన్స్ వివరాలను ట్రాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News