Maruti Suzuki Ertiga | క‌రెన్స్‌.. ఇన్నోవా.. ట్రైబ‌ర్ కానే కాదు.. ఎంపీవీ సెగ్మెంట్‌లోనే టాప్ సెల్లింగ్ మోడ‌ల్ కారు ఇదే..

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రికార్డు స్థాయిలో 43,339 యూనిట్లు విక్ర‌యించింది.

Advertisement
Update: 2024-07-16 07:00 GMT

Maruti Suzuki Ertiga | దేశీయంగా ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ఎస్‌యూవీ కార్ల‌పై మోజు పెంచుకుంటున్నారు. దాంతోపాటు మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ (ఎంవీపీ) కార్ల‌కు గిరాకీ బ‌లంగానే ఉంది. కియా క‌రెన్స్ (Kia Carens), ట‌యోటా ఇన్నోవా (Toyota Innova - Crysta and Hycross), ట‌యోటా రుమియాన్ (Toyota Rumion), రెనాల్ట్ కైగ‌ర్ (Renault Kiger), మారుతి సుజుకి ఎక్స్ఎల్ 6 (Maruti Suzuki XL6) వంటి ఎంపీవీ కార్ల‌కు గిరాకీ బాగానే ఉంది. అయితే ఎంపీవీ సెగ్మెంట్‌లో లీడ‌ర్‌గా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) మాత్ర‌మే కొన‌సాగుతున్న‌ది.

2024 జూన్ నెల‌లో అత్య‌ధికంగా అమ్ముడైన ఎంపీవీ కారు మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga). అంతే కాదు.. దేశంలో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్ కారుగా నిలిచింది. గ‌త నెల‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) 15,902 యూనిట్లు అమ్ముడైతే త‌ర్వాతీ స్థానంలో టాటా పంచ్ (Tata Punch) 18,238 యూనిట్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Swift) 16,422 యూనిట్లు, హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta) 16,293 యూనిట్లు విక్ర‌యించాయి.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రికార్డు స్థాయిలో 43,339 యూనిట్లు విక్ర‌యించింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24)లో 1,49,757 కార్ల విక్ర‌యాల‌తో టాప్‌-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల‌లో ఒక‌టిగా ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) సెవెన్ సీట‌ర్ కారు ధ‌ర రూ.8.69 ల‌క్ష‌ల నుంచి రూ.13.03 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ మోడ‌ల్ లీట‌ర్ పెట్రోల్‌పై 20.51 కి.మీ, సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 26.11 కి.మీ మైలేజీ ఇస్తుంద‌ని ప్ర‌క‌టించింది. మారుతి సుజుకి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్ బేస్డ్‌గా ఎర్టిగా కారు రూపుదిద్దుకున్న‌ది. హ‌లోజ‌న్ ప్రొజెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్‌, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ట‌చ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్ట‌మ్‌, ఫ్రంట్ ఆటోమేటిక్ ఏసీ, సెకండ్ రో రూఫ్ మౌంటెడ్ ఏసీ, ఎంఐడీ విత్ క‌ల‌ర్డ్ టీఎఫ్‌టీ, డ్యుయ‌ల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్ హోల్డ్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. హైలీ రిల‌య‌బుల్ ఇంజిన్‌, హ్యాండ్ స‌మ్ ఫ్యుయ‌ల్ ఎఫిషియెన్సీతో వ‌స్తున్న ఈ కారు ఆప్టిమ‌మ్ ఫీచ‌ర్ల‌తో వాల్యూ ఫ‌ర్ మ‌నీ ప్యాకేజీగా నిలుస్తుందీ మారుతి సుజుకి ఎర్టిగా.

Tags:    
Advertisement

Similar News