ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్ కుమార్ గుప్తా
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నేడు బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
ఆయన పదవీకాలం నేటితో ముగిసింది. ఇవాళ ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పని చేస్తానని అన్నారు.