రోడ్లు వంతెనలు కట్టిన రెండు రోజులుకే కొట్టుకపోతుంటే.. ఆ అవినీతిని ఈడీ ఎందుకు బైటికి తీయదు?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మధ్య కురిసిన వర్షాలకు అనేక చోట్ల నూతనంగా నిర్మించిన వంతెనలు, జాతీయ హైవేలు కొట్టుక పోయాయి. ఉత్తరప్రదేశ్ లోనైతే బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించిన సరిగ్గా నాలుగురోజులకే కొట్టుకపోయింది.
ఇక మధ్యప్రదేశ్ లో భోపాల్, జైపూర్ నేషనల్ హైవే 46పై 529 కోట్లతో కలియాసోట్ వద్ద ఈ సంవత్సరం ప్రారంభంలో ఓ వంతెన నిర్మించారు. ఇప్పుడు కురిసిన మొదటి వర్షానికే ఆ వంతెన కూలిపోయింది.
ఇదే రాష్ట్రంలో భోపాల్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఓ వంతెన పూర్తిగా కొట్టుకపోయింది. ఈ దారికి ప్రత్యామ్నాయ మార్గమైన హర్దా రోడ్‌లోని హతేడ్ మరియు గంజల్ నదిపై నిర్మించిన వంతెన కూడా నీటిలో మునిగిపోయింది.
ఇక ఉత్తరప్రదేశ్ లో నైతే బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ను ఈ నెల 16న ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అవసరమైతే దీనిపై విమానాలు కూడా దిగవచ్చు అని ప్రకటించారు.ఆయన ప్రారంభించి, ప్రకటించిన సరిగ్గా నాలుగురోజులకే కురిసిన వర్షాల వల్ల ఆ హైవే కొట్టుకపోయింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
విపక్షాలను వేధించడానికే మోదీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆరోపించిన అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఈడీ ఎందుకు బయటకు తీయడంలేదని ప్రశ్నించారు. ఒక్క వర్షానికే కొట్టుకపోయిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. విపక్ష నాయకులపై దాడులు చేసే ఈడీ బీజేపీ నేతల అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని అఖిలేష్ ప్రశ్నించారు.