నా డ్రస్సింగ్ స్టైల్ ని కామెంట్ చేశారు, నన్ను చంపేస్తారేమో..?

ఛత్రపతి శివాజీ మహరాజ్ పుట్టిన రాష్ట్రంలో ఉర్ఫీ జావెద్ అంగాంగ ప్రదర్శన చేయడం సరికాదంటున్నారు చిత్ర. మహారాష్ట్రలో ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించించారామె.

Advertisement
Update:2023-01-14 05:35 IST

ఎవరి వస్త్రధారణ ఎలా ఉండాలి అనే విషయంలో ఇటీవల బీజేపీ నేతలు చూపిస్తున్న చొరవ, చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా మోర్చా నేత చిత్ర కిషోర్ వాఘ్.. ఉర్ఫీ జావెద్ పై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఉర్ఫీ జావెద్ అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతోందని, మహారాష్ట్ర సంస్కృతిని ఆమె దెబ్బతీస్తోందని మండిపడ్డారు చిత్ర. మహిళా కమిషన్ ఈ విషయాన్ని పట్టించుకోవాలని, ఉర్ఫీని నియంత్రించాలని చెప్పారు. అంతవరకూ పర్లేదు అనుకున్నా, ఆ తర్వాత ఆమె హెచ్చరికలకు దిగడం మరింత సంచలనంగా మారింది.

ఛత్రపతి శివాజీ మహరాజ్ పుట్టిన రాష్ట్రంలో ఉర్ఫీ జావెద్ అంగాంగ ప్రదర్శన చేయడం సరికాదంటున్నారు చిత్ర. మహారాష్ట్రలో ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శనలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించించారామె. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో కూడా విడుదల చేశారు. పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. అరకొర దుస్తులతో ఉర్ఫీ జావెద్ వీధుల్లోకి రాకుండా చూడాలని కోరారు. అలా వస్తే ఆమెపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఉర్ఫీ జావెద్ తీవ్రంగా స్పందించారు. తన దుస్తుల గురించి మాట్లాడటానికి అసలు చిత్ర ఎవరని ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ ని ఆశ్రయించిన ఆమె.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చిత్రపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

ప్రాణ హాని ఉందని ఫిర్యాదు..

పబ్లిక్ డొమైన్‌ లో బెదిరింపులకు పాల్పడినందుకు, చిత్ర వాఘ్‌ పై ఉర్ఫీ జావెద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఆమె తరపు న్యాయవాది ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రుపాలీ చకంకర్‌ ను కలిసి తనకు ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. చిత్ర లాంటివారు చాలామంది ఉన్నారని, వారంతా తనపై దాడి చేసే అవకాశముందని ఉర్ఫీ అంటున్నారు. చిట్టి పొట్టి దుస్తులతో సోషల్ మీడియాలో హాట్ సెలబ్రిటీగా మారిన ఆమె, ఇప్పుడు బీజేపీ వార్నింగ్ తో మరింత పాపులార్టీ సంపాదించారు.

Tags:    
Advertisement

Similar News