మొన్న చంద్రయాన్.. నెక్ట్స్ సముద్రయాన్..!
బ్లూ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. 2026 నాటికి ఈ మిషన్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి.
చంద్రయాన్-3తో అంతరిక్షంలో సక్సెస్ సాధించిన భారత్..ఇక సముద్రయాన్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సబ్‌మెరైన్ మత్స్య-6000 పనులు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ సబ్‌మెరైన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తాజాగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు.
ఈ సబ్‌మెరైన్‌ను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది. దీనిని గోళాకారంలో నిర్మించారు. ఈ మిషన్ ప్రారంభమైతే ఫస్ట్ మ్యాన్‌డ్ డీప్ ఓషన్ మిషన్‌గా గుర్తింపు దక్కించుకోనుంది. ఈ జలాంతర్గామి ఫస్ట్ ఫేజ్‌లో 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని రిజిజు క్లారిటీ ఇచ్చారు. ఈ సబ్‌మెరైన్‌లో ముగ్గురు ప్రయాణించవచ్చని చెప్పారు. ఆరు కిలమీటర్ల లోతువరకు వెళ్లే కెపాసిటీ ఈ సబ్‌మెరైన్‌కు ఉందన్నారు.
బ్లూ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిల్వలున్నాయి. అరుదైన జీవజాలం కూడా ఉంది. వీటిని వినియోగించుకుంటే ఆర్థికవృద్ధి, నూతన ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2026 నాటికి ఈ మిషన్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి.