సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం, ఏడుగురు మృతి

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.

Advertisement
Update:2024-07-07 09:38 IST

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించాయి.

ఈ భవనం చాలా పురాతనమైనది కావటంతో భవనం లోపల ఉన్న 30 ఫ్లాట్లలో చాలా ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. అయినప్పటికీ 10-15 మంది అక్కడే ఉంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇంకా చాలా మంది లోపల చిక్కుకుని ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారని, ఇది సహాయక చర్యలకు ఇబ్బంది కావడంతో స్థానికులకు శాంతి , సహకారం కోసం విజ్ఞప్తి చేసామన్నారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ శిథిలాల నుంచి ఏడు మృతదేహాలను వెలికి తీశామని, సజీవంగా ఉన్న ఒకరిని కూడా రక్షించామని తెలిపారు. శిథిలాల్లో ఇంకా నలుగురు చిక్కుకున్నారని భావిస్తున్నామన్నారు.

 

2016లో ఈ భవనం నిర్మించినప్పటికీ 6 ఏళ్లకే శిథిలావస్థకు చేరుకుందని ఓ నివేదిక తెలిపింది. ఇప్పటికే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ భవనం యజమానిని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పాడైపోయిన ఈ భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరింతగా పాడైనట్టు పోలీసులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News