ఆస్పత్రిలో స్కూటర్, వీల్ చైర్ గా మారిన వేళ..

కొడుకు కాలు విరగడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాడు మనోజ్ జైన్ అనే లాయర్. ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో నేరుగా స్కూటర్ లోనే కొడుకుని లోపలికి తెచ్చాడు. స్కూటర్ తో సహా లిఫ్ట్ ఎక్కాడు.

Advertisement
Update:2023-06-17 19:56 IST
ఆస్పత్రిలో స్కూటర్, వీల్ చైర్ గా మారిన వేళ..
  • whatsapp icon

అది ఓ ప్రభుత్వ ఆస్పత్రి. పెద్ద బిల్డింగ్, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కానీ అందులో ఓ స్టెచర్ కూడా లేదు. కనీసం వీల్ చైర్ కూడా అందుబాటులో లేదు. మరి కదల్లేని పేషెంట్లను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలంటే ఎలా..? ఆటోలోనో, అంబులెన్స్ లోనో ఆస్పత్రి వద్దకు తెస్తే, ఆ తర్వాత లోపలికెళ్లడానికి దారేది..? విధిలేని పరిస్థితుల్లో ఓ తండ్రి తన కొడుకు కోసం స్కూటీనే వీల్ చైర్ గా మార్చేశాడు. ఆస్పత్రిలోకి రయ్యిమంటూ స్కూటీని తీసుకొచ్చి ఏకంగా లిఫ్ట్ లోకి కూడా ఎక్కించేశాడు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయుష్మాన్ భారత్ అంటూ ఆడంబరంగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న వేళ దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల దురవస్థను ఆ వీడియో కళ్లకు కట్టింది.


రాజస్థాన్ లోని కోటలో ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. కొడుకు కాలు విరగడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాడు మనోజ్ జైన్ అనే లాయర్. ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో నేరుగా స్కూటర్ లోనే కొడుకుని లోపలికి తెచ్చాడు. స్కూటర్ తో సహా లిఫ్ట్ ఎక్కాడు. అక్కడినుంచి మూడో అంతస్తుకి చేరుకుని కొడుక్కి వైద్యం చేయించాడు. కాలుకి కట్టు కట్టారు వైద్యులు. తిరిగి కిందకు వెళ్లడానికి కూడా అక్కడ వీల్ చైర్ లేదని చెప్పారు అటెండర్లు. దీంతో తిరిగి అదే స్కూటర్ లో లిఫ్ట్ లోకి ఎక్కబోతుండగా వారు స్కూటీ తాళాలు తీసేసుకున్నారు. దీంతో గొడవ జరిగింది.

వీల్ చైర్ లేకపోతే ఎలా..?

వీల్ చైర్ లేని పరిస్థితుల్లో కాలుకి కట్టు కట్టి ఉన్న పిల్లవాడిని ఎలా ఇంటికి తీసుకెళ్లాలి, కనీసం ఆస్పత్రి బయట వరకైనా ప్రత్యామ్నాయం చూపించాలి కదా అని ప్రశ్నించారు లాయర్ మనోజ్ జైన్. ఈ గొడవ పెద్దది కావడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆస్పత్రి సిబ్బందికి నచ్చజెప్పి తిరిగి స్కూటర్ లోనే తండ్రీ కొడుకుల్ని ఇంటికి పంపించేశారు. ఆస్పత్రిలో స్కూటీ పరుగులు తీయడం, నేరుగా లిఫ్ట్ లోకి వెళ్లడం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తండ్రి ఐడియాని చాలామంది మెచ్చుకున్నారు, దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని కొందరు దుయ్యబట్టారు. 

Tags:    
Advertisement

Similar News