సల్మాన్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

రాజస్థాన్ రాష్ట్రం షాపూర్ కు చెందిన పదహారేళ్ల యువకుడు ఈ బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా అతడిని అరెస్టు చేసిన పోలీసులు ముంబైకి తరలించారు.

Advertisement
Update:2023-04-11 16:56 IST

బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ను ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తానంటూ సోమవారం రాత్రి ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ జరిపి కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. తన పేరు రాఖీ బాయ్ అని, తమది రాజస్థాన్ రాష్ట్రమని చెప్పాడు. ఏప్రిల్ 30వ తేదీన సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

రాజస్థాన్ రాష్ట్రం షాపూర్ కు చెందిన పదహారేళ్ల యువకుడు ఈ బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా అతడిని అరెస్టు చేసిన పోలీసులు ముంబైకి తరలించారు. బెదిరింపు కాల్ పై ప్రశ్నిస్తున్నారు. మామూలుగా సినీ నటులకు ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం మామూలే. పోలీసులు కూడా ఫేక్ కాల్ గా భావించి పోలీసులు నామమాత్రంగా దర్యాప్తు జరుపుతుంటారు.

అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి బెదిరింపు కాల్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల కిందట సల్మాన్ ఖాన్ కు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ గ్యాంగ్ స్టార్ గోల్డి బ్రార్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు పోలీసులు భద్రత పెంచారు. సల్మాన్ కూడా తనకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇటీవలే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలు చేశాడు. 

Tags:    
Advertisement

Similar News