అయోధ్యలో ప్రభుత్వ పాఠశాలలో ఉప్పు కలిపిన అన్నమే మధ్యాహ్న భోజనం!
అయోధ్యలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కేవలం సాదా అన్నంతో ఉప్పు మాత్రమే వడ్డిస్తున్నారు. 2019లోఇలాంటి ఘటనే జరిగింది. విద్యార్థులకు ఉప్పు రొట్టె వడ్డించారు. వీ ఆ వీడియో తీసిన జర్నలిస్టుపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మూడేళ్లు గడిచినా, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం మెనూలో గానీ, వ్యవస్థ , ప్రభుత్వాల వైఖరిలో గానీ ఎటువంటి మార్పు రాలేదు.
అయోధ్యలోని ఆలయాల నిర్మాణానికి దానిలోని రాముడికి అట్టహాసంగా నిత్య నైవేద్యాలు సమర్పించే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి పిల్లల కడుపు మాడుస్తోంది. నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కేవలం సాదా అన్నంతో ఉప్పు మాత్రమే వడ్డిస్తోంది. ఓ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలు ఉప్పు కలిపిన అన్నం తింటున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్లేటులో కూరగాయలు, పప్పులుకానీ ఏమీ లేవు. ఈ ఆహారం ప్రభుత్వం మెనూ లో చూపెడుతున్న భోజనానికి పూర్తి భిన్నంగా ఉంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీర్జాపూర్‌లోని ఓ పాఠశాలలో 2019లోఇలాంటి ఘటనే జరిగింది. విద్యార్థులకు ఉప్పు రొట్టె వడ్డించారు. వీ ఆ వీడియో తీసిన జర్నలిస్టుపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మూడేళ్లు గడిచినా, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్న పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం మెనూలో గానీ, వ్యవస్థ , ప్రభుత్వాల వైఖరిలో గానీ ఎటువంటి మార్పు రాలేదు.
అయోధ్య పాఠశాలలో విద్యార్థులకు ఒకవైపు ఇలా సాదా బియ్యంతో ఉప్పు వడ్డిస్తూంటే , జలౌన్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం మానవత్వంతో వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండగ సందర్భంగా ఆయన తన సొంత సొమ్ముతో పిల్లల కోసం తయారు చేసిన పనీర్, పూరీ, యాపిల్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీం, రసగుల్లా వంటివి వడ్డిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో 43 శాతం పిల్లలకు 'మిడ్- డే మీల్' నిల్!
డిసెంబరు 2018లో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక డేటా విడుదల చేసింది. దేశంలోని సగం మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందడం లేదని ఆ డేటా వెల్లడించింది. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడంలో విఫలమైన పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది.
ఆ వివరాల ప్రకారం..యూపీలో 43 శాతం మంది పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. బీహార్‌లో 40 శాతం మంది పిల్లలకు, జార్ఖండ్ లో 39 శాతం పిల్లలకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందడం లేదు. మధ్యప్రదేశ్‌లో 29 శాతం మంది పిల్లలకు రాజస్థాన్‌లో 26 శాతం మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం లేదు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్ధకమవుతోంది.
నిరుపేద కుటుంబాల విద్యార్థులను ఆకలిబాధల నుంచి కాపాడడమే కాకుండా వారికి పౌష్టికాహార హక్కు కల్పించాలనే లక్ష్యంతో 1995లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకం కింద, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు 450 కేలరీల పోషకాహార ప్రమాణాలతో 12 గ్రాముల ప్రోటీన్‌లతో కూడిన వండిన ఆహారాన్ని అందించాలి. కానీ ఉత్తర ప్రదేశ్ స్కూళ్ళలో కేలరీలు, ప్రొటీన్ల సంగతి దేవుడెరుగు కనీసం సాధారణ భోజనం కూడా పిల్లలకు అందకపోవడం శోచనీయం .