అలాంటి గుణగణాలున్న అమ్మాయి అయితే ఓకే

తన నానమ్మ, తన తల్లి గుణగణాలు కలబోసి ఉన్న అమ్మాయి కనిపిస్తే వివాహం చేసుకుంటానని వెల్లడించారు. అలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయి అయితే మంచిదని చెప్పారు.

Advertisement
Update:2022-12-29 07:48 IST

తానకు న‌చ్చిన గుణగణాలున్న అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పారు 52 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో ఒక యూట్యూబ్ చానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తమకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పారు. తన నానమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఇష్టమైన మరో వ్యక్తి తమ తల్లి అన్నారు.

తన నానమ్మ, తన తల్లి గుణగణాలు కలబోసి ఉన్న అమ్మాయి కనిపిస్తే వివాహం చేసుకుంటానని వెల్లడించారు. అలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయి అయితే మంచిదని చెప్పారు.

తనపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తాను పట్టించుకోబోనన్నారు. తిట్టినా, కొట్టినా తాను ఎవరినీ ద్వేషించనని చెప్పారు. తానంటే లోలోన భయం ఉంది కాబట్టే కొందరు తనను పప్పు అంటూ ప్రచారం చేస్తుంటారని.. అలాంటి పేర్లు మరెన్ని పెట్టుకున్నా తాను బాధపడబోనన్నారు. ప్రశాంతంగానే ఉంటానని రాహుల్ వివరించారు.

Tags:    
Advertisement

Similar News