పరివార్ వర్సెస్ అస్లీ పరివార్.. హోరెత్తిపోతున్న సోషల్ మీడియా

మోదీకా పరివార్ అనే నినాదం తమకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందని బీజేపీ భావించే లోగా కాంగ్రెస్ కౌంటర్లు రెడీ చేసింది. నేరగాళ్లే మోదీ పరివారం అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

Advertisement
Update:2024-03-05 10:34 IST

ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మోదీకి కుటుంబం లేదు, సంతానం లేదంటూ లాలూ చేసిన విమర్శలకు బీజేపీ నేతలు కౌంటర్లిస్తుంటే.. వాటికి రిటర్న్ కౌంటర్లిస్తూ హోరెత్తిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ కా పరివార్ అంటూ బీజేపీ నేతలు, మోదీకా అస్లీ పరివార్ అంటూ కాంగ్రెస్ నేతలు పోటాపోటీ నినాదాలతో ట్రెండింగ్ లోకి వచ్చారు.

మోదీకా పరివార్..

మోదీకి కుటుంబం లేదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలకు బీజేపీ నేతలు 'మోదీ కా పరివార్' అనే నినాదంతో సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. మోదీ కూడా లాలూ వ్యాఖ్యలపై స్పందించడం విశేషం. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబమేనని ఆదిలాబాద్ సభలో మోదీ బదులిచ్చారు. ఆ తర్వాత బీజేపీ నేతలు 'మోదీ కా పరివార్' అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి.. సహా నేతలంతా 'మోదీ కా పరివార్' అంటూ సోషల్ మీడియా అకౌంట్లలో మార్పులు చేస్తున్నారు.

అస్లీ పరివార్..

మోదీకా పరివార్ అనే నినాదం తమకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందని బీజేపీ భావించే లోగా కాంగ్రెస్ కౌంటర్లు రెడీ చేసింది. నేరగాళ్లే మోదీ పరివారం అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ‘మోదీ కా అస్లీ పరివార్‌’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. సంఘ్‌ పరివార్‌ కాస్తా చివరికి మోదీ పరివార్‌గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News