శ్రద్ధావాకర్ హత్యకు సమాజం, స్నేహితుల వైఫల్యం ఓ కారణమే.. కిరణ్ బేడీ కామెంట్స్

Kiran Bedi on Shraddhas murder: తాజాగా ఈ సంఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. శ్రద్ధావాకర్ హత్యలో సమాజం, స్నేహితుల వైఫల్యం కూడా కారణంగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-11-16 13:55 IST

కిరణ్ బేడీ

 ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే యువతి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడు ఆఫ్తాబ్ శ్రద్ధావాకర్ ను దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఆ భాగాలను రోజుకొకచోట నగరంలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. తాజాగా ఈ సంఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. శ్రద్ధావాకర్ హత్యలో సమాజం, స్నేహితుల వైఫల్యం కూడా కారణంగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ..తమతో సంబంధాలు తెగదెంపులు చేసుకొని శ్రద్ధావాకర్ ప్రియుడితో వెళ్లిపోయినప్పటికీ తల్లిదండ్రులు ఆమెను ఓ కంట కనిపెట్టి ఉండవలసి ఉందని కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు. శ్రద్ధావాకర్ తమ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎలా ఉంది? ఆమెను ఆమె ప్రియుడు ఎలా చూసుకుంటున్నాడు? అనే విషయమై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ చూపించి ఉండాల్సి ఉందని కిరణ్ బేడీ అన్నారు.

శ్రద్ధావాకర్ నివసిస్తున్న ఇంటి యజమాని, ఆమె ఇరుగుపొరుగువారు కొంతైనా బాధ్యత తీసుకోవాల్సిందన్నారు. శ్రద్ధావాకర్ విషయంలో ఆమె తల్లిదండ్రులు ఆలస్యంగా ఆరా తీయడం వల్ల అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందన్నారు. శ్రద్ధావాకర్ హత్య ఘటనలో సమాజం, స్నేహితుల వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఆడపిల్లలను పెంచే బాధ్యత కన్నవారిదేనని, వారికి భరోసా ఇవ్వాలని కిరణ్ బేడీ తల్లిదండ్రులకు సూచించారు.

Tags:    
Advertisement

Similar News