నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ !
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించినందుకు జయప్రదపై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ సమయంలో ఆమె కోర్టుకు హాజరుకాలేకపోయారు. దాంతో, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.
Advertisement
అలనాటి నటి, మాజీ ఎంపీ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బీజేపీ నాయకురాలైన జయప్రదపై ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. వచ్చే మంగళవారం విచారణకు ఆమెను కోర్టులో హాజరు పరచాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించింది. ఆమెకు వారెంట్ జారీ అయినట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించినందుకు ఆమెపై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. కేసు విచారణ సమయంలో ఆమె కోర్టుకు హాజరుకాలేకపోయారు. దాంతో, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన జయప్రద సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
Advertisement