కర్నాటకలోకి సీబీఐకి నో ఎంట్రీ

ముడా స్కాంలో సీఎం సిద్దరామయ్య విచారణ ఎదుర్కోనున్న వేళ కీలక నిర్ణయం

Advertisement
Update:2024-09-26 18:53 IST

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) స్కాంలో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కోవాల్సిన సమయంలో కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీకి నో చెప్పేసింది. గతంలో కర్నాటకలో సీబీఐ విచారణకు ఇచ్చిన అనుమతి (జనరల్‌ కాన్సెంట్‌) ని విత్‌ డ్రా చేసుకుంది. గురువారం నిర్వహించిన కర్నాటక కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముడా స్కాంలో సిద్దరామయ్యను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఇప్పటికే ఆ రాష్ట్ర గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లినా సిద్దరామయ్యకు ఊరట దక్కలేదు. ప్రతిపక్షాలు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సీబీఐతో విచారణ చేపట్టకుండా నిరోధించడానికే జనరల్‌ కాన్సెంట్‌ ను కర్నాటక ప్రభుత్వం విత్‌ డ్రా చేసుకుంది. సీబీఐ పక్షపాతంగా వ్యవహరిస్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌ కే పాటిల్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News