బస్తర్‌, కొండాగావ్‌ జిల్లాలకు మావోయిస్టుల నుంచి విముక్తి

బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్‌ చేసిన వివరాలు చెప్పిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌

Advertisement
Update:2024-12-05 14:20 IST

ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలైన బస్తర్‌, కొండాగావ్‌ జిల్లాలకు విముక్తి కల్పించామని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా వారిని ఏరివేస్తామని వెల్లడించారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్‌ చేసిన సీఎం ఈ వివరాలు చెప్పినట్లు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టుల ఏరివేత, బస్తర్‌ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి విష్ణుదేవ్‌ సాయ్‌ వివరించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం వల్లనే మావోయిస్టుల ఏరివేత సాధ్యపడుతున్నదని సీఎం వివరించారు. పోలీసు బలగాల ఆపరేషన్‌తో పాటు రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య, మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి కల్పించే చర్యలు కూడా దీనికి దోహదం చేశాయని ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది. లొంగిపోయే మావోయిస్టులకు పునరావసం కల్పించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. బస్తర్‌ ఒలింపిక్‌ ముగింపు వేడుకలకు రావాలని అమిత్‌ షాను విష్ణు దేవ్‌ సాయ్‌ ఆహ్వానించారు.

Tags:    
Advertisement

Similar News