Kantara Movie: కాంతార సినిమాకు షాకిచ్చిన కేరళ కోర్టు

Kantara Movie: తమ అనుమతి లేకుండా కాంతార మూవీ మేకర్స్ తమ పాట కాపీ కొట్టారంటూ మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టుకు వెళ్లారు. కొజికొడె జిల్లా సెషన్స్ కోర్టులో కొద్దిరోజులుగా దీనిపై విచారణ జరుగుతోంది

Advertisement
Update:2022-10-29 17:20 IST

ఒక చిన్న సినిమాగా విడుదలైన కన్నడ మూవీ `కాంతార` దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా నటించిన రిషబ్ శెట్టికి ఈ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. కాగా కాంతార సినిమాలో వరాహరూపం అనే పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ కాంతార సినిమాలోని వరాహరూపం పాట తాము రూపొందించిన నవరసం అనే పాటను కాపీ చేసి సినిమాలో వాడారని ఆరోపణలు చేసింది.

తమ అనుమతి లేకుండా కాంతార మూవీ మేకర్స్ తమ పాట కాపీ కొట్టారంటూ మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టుకు వెళ్లారు. కొజికొడె జిల్లా సెషన్స్ కోర్టులో కొద్దిరోజులుగా దీనిపై విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసు విషయమై జడ్జి తీర్పు ఇచ్చారు. కాంతార సినిమాలోని వరాహరూపం పాటను తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా థియేటర్లలో ప్రదర్శించవద్దంటూ తీర్పు ఇచ్చింది.

అలాగే అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియో సావన్ వంటి ఫ్లాట్ ఫామ్స్ లో పాటను ప్లే చేయవద్దని ఆ తీర్పులో పేర్కొంది. కాంతార సినిమాలో వరాహరూపం పాట ఎంతో పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ సమయంలో ఆ సినిమాలోని వరాహరూపం పాటను ప్రదర్శించవద్దని కోర్టు తీర్పు ఇవ్వడం కాంతారకు కొంత నష్టం చేకూర్చేదే. కాగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ హర్షం వ్యక్తం చేసింది.

Tags:    
Advertisement

Similar News