బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తుల విక్రయానికి బిడ్డింగ్‌ల ఆహ్వానం

తెలంగాణ, ఏపీ, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను విక్రయించనున్నారు. మొత్తం 13 ఆస్తులను అమ్మేస్తున్నారు. వీటి విలువ 20 వేల 160 కోట్ల రూపాయలుగా తేల్చారు. వచ్చే నెల 5 నుంచి బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తూ సోమవారం ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం.

Advertisement
Update:2022-11-15 08:12 IST

వీలైతే హోల్‌సేల్‌గా అమ్మేయడం, కుదరకపోతే విడతల వారీగా అమ్మేయడం. ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానం. ప్రభుత్వానికి గర్వకారణమైన సంస్థలను నష్టాల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోడీ సర్కారు శరవేగంగా ముందుకెళ్తోంది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల విక్రయానికి బిడ్డింగ్‌లను ఆహ్వానించింది.

తెలంగాణ, ఏపీ, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను విక్రయించనున్నారు. మొత్తం 13 ఆస్తులను అమ్మేస్తున్నారు. వీటి విలువ 20 వేల 160 కోట్ల రూపాయలుగా తేల్చారు. వచ్చే నెల 5 నుంచి బిడ్డింగ్‌లను ఆహ్వానిస్తూ సోమవారం ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో పటాన్‌చెరు వద్ద ఉన్న ఆస్తులను అమ్మేస్తున్నారు. ఏపీలో తాడేపల్లిగూడం, కొండపల్లిలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను విక్రయిస్తారు.

ఆస్తుల నగదీకరణలో భాగంగా వీటిని అమ్ముతున్నట్టు ప్రకటించారు. ఆస్తులు విక్రయించగా వచ్చిన డబ్బును నెట్‌వర్క్ విస్తరించడానికి వాడుతామని ప్రభుత్వం చెబుతోంది. తొలి విడతలో 13 ఆస్తులు అమ్మేసి.. ఆ తర్వాత మరిన్ని ఆస్తులను అమ్మడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌పై అనేక ప్రయోగాలను కేంద్రం చేస్తోంది. నష్టాల పేరుతో ఆస్తులు అమ్మడం, ఉద్యోగులను కుదించడం చేస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌లో అమలు చేసింది. ఎక్కువ ధర వచ్చే ప్రాంతాల్లోని విలువైన భవనాలు, స్థలాలను అమ్మేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన రూపాన్ని కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News