ఉద్యోగం ఇస్తే చాలు ఫ్రీగా పనిచేస్తా
ఉద్యోగం దొరక్క నిరాశతో తన రెజ్యుమేను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు ఓ బెంగళూరు గ్రాడ్యుయేట్
స్టడీస్ కంప్లీట్ చేసి రెండేండ్లు అయినా ఉద్యోగం దొరకక ఓ టెకీ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఎక్స్‌పీరియన్స్ లేదంటూ ఎదుర్కొన్న తిరస్కరణలతో కొత్త ఆలోచన చేశాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిరుద్యోగంతో నిరాశ చెందిన ఓ బెంగళూరు గ్రాడ్యుయేట్ తన రెజ్యుమేను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. 2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాన్ని సాధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. నా రెజ్యుమేను పక్కనపెట్టినా పర్లేదు కానీ నాకు సాయం చేయండి. ఉచితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సుల్లో ప్రావీణ్యం ఉందన్నారు. ఇలా పనిచేయడం ద్వారా కనీసం ఎక్స్‌పీరియన్స్ అయినా వస్తుందని ఆ టెకీ ఆలోచన. ఈ పోస్టుపై పలువురు స్పందించారు. కొందరు సలహాలు, సూచనలు చేశారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోమని సూచించారు.