శుభ్రం చేస్తుండగా పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

ఈ ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ శర్మపై కేసు నమోదు చేసి అతడిని తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Update:2023-12-09 08:29 IST
శుభ్రం చేస్తుండగా పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌
  • whatsapp icon

పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐ త‌న తుపాకీని శుభ్రం చేస్తుండగా అది పొరపాటున పేలి మహిళ తలలోకి దూసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పోలీస్‌స్టేషన్‌లోని సీసీ టీవీలో రికార్డయింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం అలీగఢ్‌లోని కొత్వాలినగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మహిళ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది.

ఈ వీడియోలో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే.. ఓ మహిళ పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వచ్చి అక్కడే కాసేపు నిలబడ్డారు. ఆ కాసేపటికే ఒక పోలీస్‌ అధికారి వచ్చి ఎస్ఐకి తుపాకీ ఇవ్వగా, ఆయన దానిని శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అది పేలి తూటా ఎదురుగా ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో బుల్లెట్‌ తలలోకి దూసుకుపోయిన మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ శర్మపై కేసు నమోదు చేసి అతడిని తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మహిళకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News