ఒకరు ఒక చోటే పోటీ చేయాలి

రాజీనామా చేసిన వ్యక్తులపై మాత్రం పైసా భారం ఉండేది కాదు. దీన్ని అలుసుగా తీసుకుని రెండు మూడు చోట్ల పోటీ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి.

Advertisement
Update:2022-10-09 07:03 IST

ఎన్నికల సంఘం మరో సంస్కరణకు సిద్ధ‌మవుతోంది. ఎన్నికల నిర్వాహణ ఖర్చు తగ్గించేందుకు కీలక ప్రతిపాదన చేసింది. ఇప్పటి వరకు ఎన్నికల్లో అభ్యర్థులు ఒకటికి మించి స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. దాంతో నేతలు రెండు, మూడు స్థానాల్లోనూ ఏక కాలంలో పోటీ చేసేవారు. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిస్తే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేసేవారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేది. తిరిగి ఎన్నికల నిర్వాహణ భారం ప్రజా ఖజానాపైనే పడేది.

రాజీనామా చేసిన వ్యక్తులపై మాత్రం పైసా భారం ఉండేది కాదు. దీన్ని అలుసుగా తీసుకుని రెండు మూడు చోట్ల పోటీ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఇందిరా గాంధీ, మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, ఎన్టీఆర్, పీవీ, పవన్‌ కల్యాణ్ ఇలా చాలా మంది రెండు చోట్ల పోటీ చేశారు. పవన్‌ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడంతో ఉప ఎన్నికలు రాలేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసింది. ఒక అభ్యర్థి ఒక సమయంలో ఒకచోట మాత్రమే పోటీ చేసేలా చూడాలని లేఖలో కోరింది. దశాబ్దాలుగా ఈ డిమాండ్ ఉంది. ఒకవేళ ఈ నిబంధన అమలులోకి వస్తే చావోరేవో అనుకుని అభ్యర్థులు ఒక చోట మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News