యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభం

ఈ మేరకు చెత్త స్కిమ్మర్లు, కలుపు తీసే యంత్రాలు రంగంలోకి దించిన అధికారులు

Advertisement
Update:2025-02-17 19:34 IST

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. పక్కా ప్రణాళికతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు చెత్త స్కిమ్మర్లు, కలుపు తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి. వివిధ శాఖల సమన్వయంతో నదీ ప్రక్షాళన పనులు పర్యవేక్షించాలని అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు. శుద్ధి చేయని జలాలను కాలువల్లోకి వదులుతున్న పారిశ్రామిక యూనిట్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News