రేపు మహారాష్ట్రకు సీఎం రేవంత్‌ రెడ్డి

మహావికాస్‌ అఘాడీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం

Advertisement
Update:2024-11-15 23:40 IST

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని మహావికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థుల తరపున రెండు రోజుల పాటు ఆయన ప్రచారం చేయనున్నారు. రెండు రోజుల పాటు ఆయన మహారాష్ట్రలోనే ఉండి ప్రచారం చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 10 గంటలకు నాగ్‌పూర్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రాపూర్‌ కు చేరుకొని స్థానిక నాయకులతో కలిసి కూటమి అభ్యర్థుల తరపున రాజురా, డిగ్రాస్, వార్దా​ నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. శనివారం రాత్రి నాగ్‌పూర్‌ లో బస చేస్తారు. ఆదివారం ఉదయం నాగ్​పూర్​ నుంచి నాందేడ్​కు చేరుకుంటారు. అక్కడ ప్రచార సభలో పాల్గొన్న తర్వాత నయగావ్, భోకర్​​, షోలాపూర్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌ కు తిరిగి వచ్చేస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 20న జరుగనుంది. సోమవారం (ఈనెల 18న) సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Tags:    
Advertisement

Similar News