BRS విజయవంతం కావాలంటూ ముంబై లో ప్రార్థనలు
ముంబై తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ముంబై, ధారవిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించిన యునైటెడ్ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ సర్వీస్‌లో దాదాపు 300 మంది పాస్టర్లు, వారి కుటుంబ సభ్యులు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విజయం సాధించాలని ప్రార్థనలు నిర్వహించారు.
కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి విజయం చేకూరాలని కోరుకుంటూ ముంబై లో క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వందల మంది ప్రార్థనలు చేశారు.
ముంబై తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ముంబై, ధారవిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించిన యునైటెడ్ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ సర్వీస్‌లో దాదాపు 300 మంది పాస్టర్లు, వారి కుటుంబ సభ్యులు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విజయం సాధించాలని ప్రార్థనలు నిర్వహించారు.
భారతదేశ అభివృద్ధిని కొత్త శిఖరాలకు నడిపించగల సామర్థ్యం ఉన్న బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి క్రైస్తవ సమాజం మద్దతు ఇవ్వాలని వారు కోరారు.
ఈ కార్యక్రమానికి ధారవి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్షా గైక్వాడ్ గాడ్సే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, నటుడు జానీ లీవర్ హాజరయ్యారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు నుంచి తెలుసుకున్న పాస్టర్లు, వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలాగా దేశమంతా అభివృద్ధి ఫలాలు అందుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి దేశాన్ని గుణాత్మక మార్పు దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.