ఇష్టమైన కారుకు అంతిమ సంస్కారం

భారీగా ఖర్చు చేసి కారును సమాధి చేసిన గుజరాతి కుటుంబం

Advertisement
Update:2024-11-09 19:29 IST

తమకు ఎంతో ప్రీతిపాత్రమైన కారుకు సంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.4 లక్షలు ఖర్చు చేశారు. 1,500 మంది అతిథుల సమక్షంలో ఈ ఘట్టం నిర్వహించారు. గుజరాత్‌ లోని అమ్రేలి జిల్లాకు చెందిన ఒక కుటుంబం 12 ఏళ్ల క్రితం మారుతి వ్యాగన్‌ ఆర్‌ కారును సెకండ్‌ హ్యాండ్‌ లో కొనుగోలు చేసింది. ఆ కారు కొన్న తర్వాత ఆ కుటుంబానికి కలిసి వచ్చింది. దీంతో కుటుంబంలోని అందరూ ముద్దుగా లక్కీ అని పిలిచే వారు. లైఫ్‌ టైం పూర్తి చేసుకున్న ఆ కారు ఇక సేవలందించలేకపోయింది. మామూలుగా అయితే సర్వీస్‌ అయిపోయిన కారును ఎవరైనా అమ్మేస్తారు. కానీ ఆ కుటుంబం అలా చేయలేదు. ఇంటి పెద్ద సంజయ్‌ పలోరా కోరిక మేరకు కారుకు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నారు. కారును కడిగి అందంగా ముస్తాబు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆ కారును సమాధి చేశారు. ఈ అంతిమ సంస్కారానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News