ఆప్‌ అగ్రనేతల ఘోర పరాజయం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కేజ్రీవాల్‌, సిసోడియా, సత్యేంద్ర జైన్‌

Advertisement
Update:2025-02-08 13:21 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అగ్రనేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, నేషనల్‌ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి ఓటమి చెందగా, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా జంగ్‌పురా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్‌ సింగ్‌ మార్వా చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఫర్హాద్‌ సురికి డిపాజిట్‌ దక్కలేదు. మరో కీలకనేత మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ షాకూరుబస్తీ అసెంబ్లీ స్థానం నుంచి 20 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కర్నాల్‌ సింగ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సతీశ్‌ కుమార్‌ లూథ్రాకు డిపాజిట్‌ దక్కలేదు.

Tags:    
Advertisement

Similar News